టోక్యో ఒలింపిక్స్ కంటే క్రీడాకారుల ఆరోగ్యమే ముఖ్యమని తేల్చి చెప్పిన ఆస్ట్రేలియా
- జూలై 24 నుంచి టోక్యో వేదికగా ఒలింపిక్స్!
- ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా
- ఒలింపిక్స్ లో పాల్గొనరాదని ఆస్ట్రేలియా నిర్ణయం
- ఇప్పటికే తప్పుకున్న కెనడా
తమ ఒలింపిక్ బృందాన్ని టోక్యో పంపించాలన్న ఆలోచన విరమించుకున్నామని, ఒలింపిక్స్ నిర్వహణపై ఐఓసీ నిర్ణయం వచ్చేవరకు వేచిచూడలేమని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ చీఫ్ మాట్ కరోల్ తెలిపారు. ఒలింపిక్స్ జరుగుతాయా, లేదా అనే అనిశ్చితిలో ఉన్న తమ అథ్లెట్లు ఈ నిర్ణయంతో కుదుటపడతారని కరోల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అతిపెద్ద క్రీడాసంరంభంగా పేరుగాంచిన ఒలింపిక్స్ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జపాన్ లో టోక్యో వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణతో ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.