YSRCP: ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులపై హైకోర్టు తీర్పుకు సుప్రీం సమర్థన.. ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత!

  • పార్టీ రంగులను తొలగించాలని ఆదేశించిన ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం
Supreme Court gives shock to YSRCP

ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలకు రంగులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెంటనే రంగులను తొలగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా... కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే మీరు ఊరుకుంటారా? అని ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. కార్యాలయాలకు రంగులు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News