Corona Virus: లాక్‌డౌన్‌ పాటించకుండా రోడ్లపైకి వస్తోన్న వారిని అరెస్టు చేసిన పోలీసులు

  • హైదరాబాద్‌లో ఆటోలు, ప్రైవేటు వాహనాలు చక్కర్లు
  • హెచ్చరికలను పట్టించుకోని చాలా మంది వాహనదారులు
  • నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం
  • రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో పలువురి వాహనాలు స్వాధీనం
lockdown in telangana

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ చాలా మంది రోడ్లపైకి వస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉదయం నుంచి  ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరిగాయి. టీఎస్ ఆర్టీసీ బంద్ కావడంతో ప్రైవేటు వాహనాలు ధరలు పెంచేస్తున్నాయి.

ప్రభుత్వం చేస్తోన్న హెచ్చరికలను చాలా మంది వాహనదారులు పట్టించుకోవట్లేదు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడం గమనార్హం. దీంతో టోల్ గేట్లను మూసేశారు. ఇళ్లలోంచి బయటకు వచ్చిన వారికి కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వెనక్కి పంపుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో వాహనాలపై యథేచ్ఛగా తిరుగుతోన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని తెలిపారు. వారి వాహనాలు సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించామని చెప్పారు. మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు.

More Telugu News