Amaravati: ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అమరావతిలో రాజధానేతరులకు భూ పంపిణీ జీఓపై స్టే

  • గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని వాసులకు స్థలాలు కేటాయించిన సర్కారు
  • దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజధాని రైతులు
  • కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం సమాలోచన
highcourt stay on land distribution for outsiders in amaravathi

ఆంధ్రప్రదేశ్‌లోని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపునకు ఇటీవలే నో చెప్పిన కోర్టు తాజాగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి భూముల కేటాయింపుపై జారీ చేసిన జీవోపైనా స్టే ఇచ్చింది.

గుంటూరు, విజయవాడ, దుగ్గిరాల, పెదకాకాని ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల కోసం 1215 ఎకరాల భూమిని  కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా రాజధాని గ్రామాల్లోని పేదలకు మాత్రమే ఇక్కడి భూములు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉన్న విషయాన్ని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

More Telugu News