ICMR: నిన్న ఒక్కరోజే 19 మందికి కరోనా.. దేశంలో మరింత పెరిగిన కేసులు

Total number of positive Coronavirus cases in the country is  415
  • ప్రకటించిన ఐసీఎమ్‌ఆర్‌
  • దేశంలో 415కి చేరిన కరోనా కేసులు
  • ఇప్పటివరకు ఏడుగురి మృతి 

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) తెలిపింది. నిన్న ఒక్కరోజు దేశంలో 19 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కరోనాతో ఇప్పటివరకు దేశంలో ఏడుగురు మృతి చెందారు. మహారాష్ట్రలో ఇద్దరు మృతి చెందగా, కర్ణాటక, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, బీహార్‌ల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

నిన్న అత్యధికంగా ముంబైలో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 89కి చేరింది. కర్ణాటకలో ఇప్పటివరకు 27 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు ప్రకటించారు. కర్ణాటకలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News