Corona Virus: లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు: కేంద్రం

   legal action will be taken against violators
  • దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్
  • రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన
  • లాక్‌డౌన్‌ను తప్పకుండా పాటించాల్సిందే 
కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను లెక్క చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సర్కారు సూచించింది.

లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పకుండా పాటించేలా చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలిపింది. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిందని పేర్కొంది. కాగా, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు.                      
Corona Virus
India

More Telugu News