Nithin: రణబీర్ కపూర్ హీరోగా 'భీష్మ' రీమేక్?

  • యూత్ ను మెప్పించిన 'భీష్మ'
  • నితిన్ కెరియర్లోనే భారీ వసూళ్లు 
  • హిందీ రీమేక్ నిర్మాతగా కరణ్ జొహార్  
Bheeshma Movie

తెలుగులో ఈ మధ్య కాలంలో భారీ విజయాలను సాధించిన చిత్రాలను హిందీలో రీమేక్ చేయడానికి అక్కడి దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. ఇక్కడి 'అర్జున్ రెడ్డి' అక్కడ 'కబీర్ సింగ్' గా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, ఈ పోటీ మరింత పెరిగింది. 'జెర్సీ' .. 'ఆర్ ఎక్స్ 100' చిత్రాలు కూడా హిందీ రీమేక్స్ గా రూపొందుతున్నాయి. ఆ జాబితాలోకి 'భీష్మ' కూడా చేరిందనేది తాజా సమాచారం.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా రూపొందిన 'భీష్మ' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించడంతో, నితిన్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో కరణ్ జొహార్ వున్నాడని సమాచారం. రణ్ బీర్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడని చెబుతున్నారు. 'డియర్ కామ్రేడ్' రీమేక్ రైట్స్ కూడా కరణ్ జొహార్ దగ్గరే వున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News