Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అజయ్ సరసన మరోసారి రకుల్ 
  • తమిళ చిత్రంలో శర్వానంద్ 
  • అజిత్ తో సుధ కొంగర సినిమా
Rakul plays opposite Ajay Devagan again

 *  ఆమధ్య అజయ్ దేవగణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో చేసిన 'దేదే ప్యార్ దే' చిత్రం ఆమెకు అక్కడ మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. అజయ్ హీరోగా రూపొందే 'థ్యాంక్ గాడ్' చిత్రంలో ఆయనకు జోడీగా రకుల్ ను ఎంపిక చేశారు.
*  చాలా కాలం గ్యాప్ తర్వాత శర్వానంద్ మళ్లీ ఇప్పుడు తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకత్వం వహించే చిత్రంలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  
*  తమిళనాట రాణిస్తున్న లేడీ డైరెక్టర్ సుధ కొంగర తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరో అజిత్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆమె వినిపించిన కథ అజిత్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, జూలై నుంచి ఈ ప్రాజక్టు పట్టాలెక్కుతుందని సమాచారం.

More Telugu News