'జనతా కర్ఫ్యూ'పై కౌన్సిలర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన సంగారెడ్డి పోలీసులు

Sangareddy Councillor controversial comments on Janata Curfew
  • సీఏఏ చట్టాన్ని తొలగించేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దు
  • జనం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని వీడియో
  • కేసు నమోదు చేసి గృహ నిర్బంధంలో ఉంచిన పోలీసులు
ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలంటూ సంగారెడ్డి జిల్లాలో ఓ కౌన్సిలర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచారు. పట్టణంలోని 34వ వార్డు కౌన్సిలర్ అయిన షమీ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వెనక్కి తీసుకునేంత వరకు మోదీ మాటలను పట్టించుకోవద్దని, జనతా కర్ప్యూను పట్టించుకోకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేయాలని ఆ వీడియోలో పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన షమీపై కేసు నమోదు చేసి గృహనిర్బంధంలో ఉంచినట్టు  సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Go Back to Shorts
Telangana
Sangareddy District
Janata Curfew
councillor

More Telugu News