India: ఒక్కరోజులో ముగ్గురి మృతి... భారత్ లో తీవ్రమవుతున్న కరోనా

Three people died in India due to corona
  • దేశంలో ఏడుకు చేరిన కరోనా మరణాలు
  • బీహార్ కు చెంది 38 ఏళ్ల వ్యక్తి మృతి
  • దేశంలో కరోనా మృతుల్లో ఇతడే పిన్నవయస్కుడు
చైనాను దాటి ప్రపంచదేశాలపై పంజా విసురుతున్న కరోనా భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇవాళ ఒక్కరోజులోనే ముగ్గురు మృతి చెందడం ఈ మహమ్మారి వ్యాపిస్తున్న తీరుకు నిదర్శనం. తాజా మరణాలతో భారత్ లో ఇప్పటివరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. బీహార్ కు చెందిన 38 ఏళ్ల వ్యక్తి కూడా మృతుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారిలో ఈ బీహార్ వ్యక్తి పిన్నవయస్కుడు. అతడు పాట్నాలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇవాళ మరణించిన మిగతా ఇద్దరిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు గుజరాత్ కు చెందిన వ్యక్తి.
India
Corona Virus
Deaths
Bihar
Maharashtra
Gujarath
COVID-19

More Telugu News