Vijayawada: విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు... హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు

First corona positive case in Vijayawada
  • ఏపీలో మరో పాజిటివ్ కేసు
  • వ్యక్తి కుటుంబసభ్యులకూ వైద్య పరీక్షలు
  • ఆ వ్యక్తి ప్రయాణించిన కారులో మరో ముగ్గురున్నట్టు గుర్తింపు
ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజయవాడలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్టు గుర్తించామని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు వైద్యపరీక్షలు నిర్వహించామని, ఆ వ్యక్తి కలిసిన వాళ్ల వివరాలు కూడా సేకరించామని తెలిపారు. కరోనా బాధితుడి నివాసానికి మూడు కిలోమీటర్ల పరిధిలో అందరినీ అప్రమత్తం చేశామని, సుమారు 500 నివాసాల్లో ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించామని వివరించారు. కాగా, విజయవాడలో తొలి కరోనా కేసు నమోదవడంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలో 144 సెక్షన్ విధించామని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కరోనా వ్యక్తి ప్రయాణించిన కారులో మరో ముగ్గురు ప్రయాణించినట్టు తెలిసిందని, వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Vijayawada
Corona Virus
Positive
Andhra Pradesh
India
COVID-19

More Telugu News