Telangana: లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఏపీ యువకుడికి కరోనా.. తెలంగాణలో 22కు చేరిన కేసులు

coronavirus cases in telangana
  • తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటన
  • గుంటూరు యువకుడికి గాంధీలో చికిత్స
  • కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 22కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్ విమానాశ్రయానికి రావడంతో అతడిని పరీక్షించారు. దీంతో అతడికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అతడికి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ వారి చేతులకు స్టాంపులు వేస్తున్నారు. ఒకవేళ చేతిలో స్టాంపులతో ఎవరైనా బయట తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
Telangana
Corona Virus

More Telugu News