Corona Virus: వర్క్‌ ఫ్రమ్ హోం ఎఫెక్ట్‌ : ఇంటర్నెట్‌ డేటాకు యమ డిమాండ్‌!

  • హఠాత్తుగా పెరిగిన పది శాతం ట్రాఫిక్‌
  • వెల్లడించిన టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు
  • నాణ్యతలో ఇబ్బంది ఉండదని వెల్లడి
High demand for Internet demand

కరోనా ప్రభావంతో ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్ హోం’ అవకాశం ఇవ్వడం, వృత్తి, వ్యాపారాల్లో స్థిరపడిన వారు కూడా ఇంటి నుంచే పనిచేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుండడంతో ఇంటర్నెట్‌ డేటాకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిందని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు తెలియజేస్తున్నారు.

ఇటీవల కాలంలో ట్రాఫిక్‌ పది శాతం పెరిగిందని గుర్తించారు. ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరగడం కారణంగా నెట్‌వర్క్‌ స్తంభించే అవకాశం లేదని, సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌.మ్యాథ్యూస్‌ వెల్లడించారు. డేటా డిమాండ్‌ పెరిగిన ఫలితంగా సమస్యలు ఎదురుకావని, నెట్‌వర్క్స్‌ అన్నీ ఆ మేరకు సామర్థ్యంతో ఉన్నాయన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు.

మరోవైపు రిలయన్స్‌ జియో వంటి టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వారి మొబైల్స్‌లో డేటా కెపాసిటీని డిమాండ్‌కు అనుగుణంగా పెంచుతున్నాయి. టాప్‌ అప్స్‌కు సరికొత్త టారిఫ్‌ ప్యాకేజ్‌ను జియో ఇటీవల లాంఛ్‌ చేసింది. ఇక భారతి ఎయిర్‌టెల్‌ హోం బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఇంటి నుంచి పనిచేసుకునేందుకు వీలుగా వేగవంతమైన, అధిక డేటా ప్లాన్స్‌ను వర్తింపజేస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

More Telugu News