Andhra Pradesh: ఏపీలో కొత్తగా రెండు పాజిటివ్ కేసుల నమోదు

Two more corona positive cases in AP
  • విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాలో కరోనా బాధితుల గుర్తింపు
  • ఏపీలో ఐదుకు చేరిన కరోనా కేసులు
  • తెలంగాణలోనూ కరోనా విస్తరణ
ఏపీలో కరోనా క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయవాడలో ఒకరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఐదుకి చేరింది. దేశంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. మరోవైపు తెలంగాణలో కొత్తగా రెండు కేసులు వెలుగుచూడడంతో మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. ​
Andhra Pradesh
Corona Virus
Positive
Telangana
COVID-19

More Telugu News