Pakistan: పాకిస్థాన్ లో కరోనా వ్యాప్తి ఎలా ఉందో చూడండి!

Corona positive cases reaches 671 in Pakistan
  • పాక్ లో ఇప్పటివరకు 671 పాజిటివ్ కేసులు
  • కరోనాతో ముగ్గురు మృతి
  • అత్యధికంగా సింధ్ రాష్ట్రంలో 361 కేసులు
చైనాలోని వుహాన్ నగరం కేంద్రస్థానంగా ఉద్భవించిన కరోనా మహమ్మారి ఆ దేశం, ఈ దేశం అనే తేడా లేకుండా శరవేగంగా వ్యాపిస్తోంది. చైనాకు మిత్రదేశమైన పాకిస్థాన్ ను కూడా వదల్లేదు. పాక్ లోనూ ఈ వైరస్ భూతం వేగంగా విస్తరిస్తూ అక్కడి ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు పాక్ లో 671 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ముగ్గురు మరణించారు. ఐదుగురిని మాత్రమే డిశ్చార్జ్ చేశారు. అత్యధికంగా సింధ్ రాష్ట్రంలో 361 మంది కరోనా బాధితులను గుర్తించారు.
Pakistan
Corona Virus
Positive
China

More Telugu News