Jio: కరోనా నేపథ్యంలో జియో నుంచి ధమాకా ఆఫర్

Jio introduces new plan in the wake of corona outbreak
  • దేశంలో పెరుగుతున్న కరోనా విస్తృతి
  • వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్న సంస్థలు, ప్రభుత్వాలు
  • రూ.251 కే 51 రోజుల డేటా ప్లాన్ తీసుకువచ్చిన జియో
కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ జియో సరికొత్త ప్లాన్ తో వచ్చింది. దీనిపేరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్. దీని కాలపరిమితి 51 రోజులుగా కాగా, ధరను రూ.251గా నిర్ణయించారు. ఈ ప్లాన్ లో భాగంగా ప్రతిరోజు 2 జీబీ డేటా పొందవచ్చు. ఇది కేవలం డేటా ప్లాన్ మాత్రమే. కాల్స్, మెసేజింగ్ చేసుకోవడం కుదరదు. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇదే తరహాలో కొత్త కస్టమర్లకు నెలరోజుల పాటు బ్రాడ్ బ్యాండ్ ఉచితమంటూ ఆఫర్ ప్రకటించింది.
Jio
Corona Virus
Work From Home
Data Plan

More Telugu News