Allu Arjun: తన పిల్లలు స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే మురిసిపోయిన బన్నీ

Allu Arjun enjoys his children dance at school function
  • ప్రీస్కూలింగ్ పూర్తిచేసుకున్న బన్నీ తనయుడు అయాన్
  • స్కూల్లో జరిగిన ఫంక్షన్ లో అయాన్, అర్హ చిందులు
  • వీడియో తీసిన బన్నీ
టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ ప్రీస్కూలింగ్ పూర్తిచేసుకున్నాడంటూ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వేడుకలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. తన బిడ్డలు అయాన్, అర్హ బోధి వ్యాలీ స్కూల్లో జరిగిన ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తుండగా అల్లు అర్జున్ మురిసిపోతూ చూసిన వైనం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయాన్, అర్హ డ్యాన్స్ చేస్తుండగా ఆ ఘట్టాన్ని బన్నీ వీడియో తీశాడు. కాగా, ఈ ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కు బన్నీతో పాటు ఆయన అర్ధాంగి స్నేహారెడ్డి, తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మల కూడా హాజరయ్యారు.

Allu Arjun
Allu Ayan
Arha
PreSchooling
Hyderabad

More Telugu News