Tirumala: తిరుమల కొండ ఇప్పుడెలా ఉందో చూడండి... ఫొటోలు ఇవిగో!

  • కరోనా కారణంగా పుణ్యక్షేత్రాల్లో దర్శనాల నిలిపివేత
  • తిరుమలలోనూ బంద్ తరహా వాతావరణం
  • బోసిపోయిన తిరుమాడవీధులు
Tirumala shrine looks no mans land

కరోనా వైరస్ కారణంగా వ్యవస్థలన్నీ నిలిచిపోతున్నాయి. దేశంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రముఖ దేవస్థానాలు సైతం వెలవెలబోతున్నాయి. తిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో దర్శనాలు నిలిపివేశారు. నిత్యం వేలమంది భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే తిరుమల గిరులు కరోనా కారణంగా బోసిపోయాయి. శ్రీవారి దర్శనాలు నిలిపివేయడమే అందుకు కారణం. ప్రస్తుతం స్వామివారికి దైనందిన కైంకర్యాలు మాత్రమే జరుగుతున్నాయి. తిరుమాడవీధుల్లో జనసంచారమే లేదు.

వేలమంది భక్తులు రావడం వల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశాలున్న నేపథ్యంలో టీటీడీ దర్శనాల నిలిపివేత నిర్ణయం తీసుకుంది. భక్తులను కొండపైకి కూడా రానివ్వడంలేదు. గత మూడ్రోజుల నుంచే అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇవాళ తిరుమల గిరులే కాదు అలిపిరి కూడా ఖాళీగా దర్శనమిచ్చింది. అందుకు సాక్ష్యం ఈ ఫొటోలే...

More Telugu News