Anushka Shetty: ఫ్రెండ్స్ పంపే మెసేజ్ ల ద్వారా పుకార్ల గురించి తెలుసుకుంటాను: అనుష్క

Anushka responds about rumors
  • పుకార్లను పట్టించుకోనన్న అనుష్క
  • రూమర్లు రాసేవారికి అక్కాచెల్లెళ్లు, పిల్లలు ఉండరా? అంటూ ఆగ్రహం
  • తనకెప్పుడూ క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురుకాలేదని వెల్లడి
టాలీవుడ్ అగ్రనటి అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీగా ఉన్న అనుష్క తాజాగా ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చే ఊహాగానాల పట్ల స్పందిస్తూ, తాను టీవీ ఎక్కువగా చూడనని, పత్రికలు చదవడం చాలా తక్కువని చెప్పారు. ఫ్రెండ్స్ పంపే మెసేజ్ ల ద్వారానే పుకార్ల గురించి తెలుసుకుంటానని, అయినా అలాంటి ఊహాగానాలు ఎందుకు ప్రచారం చేస్తుంటారో అర్థం కాదని అన్నారు. తనపై వదంతులు రాసేవారికి అక్కాచెల్లెళ్లు, పిల్లలు ఉండరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన విషయంలోనే కాదని, సినీ పరిశ్రమలోనే రూమర్లు సర్వసాధారణమని అన్నారు. తనపై వచ్చే రూమర్లను పట్టించుకోనని అనుష్క స్పష్టం చేశారు. ఇక, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పలేనని, అయితే తనకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. 
Anushka Shetty
Tollywood
Rumors
Nishabdam

More Telugu News