Tata Motors: కరోనా ఉద్ధృతి పెరిగితే ప్లాంట్ మూసేస్తాం: టాటా మోటార్స్ ఎండీ

Tata Motors set to close Pune plant due to corona scare
  • ఇప్పటికే పుణేలోని టాటా కర్మాగారంలో వాహనాల తయారీ తగ్గింపు
  • ప్లాంట్ నిలిపివేసినా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామన్న టాటా వర్గాలు
  • యూకేలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్యకలాపాలు బంద్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాటా మోటార్స్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మున్ముందు కరోనా తీవ్రత పెరిగితే మహారాష్ట్రలోని ప్లాంట్ ను మూసివేస్తామని టాటా మోటార్స్ ఎండీ గ్వెంటర్ బషెక్ వెల్లడించారు. దేశంలో కరోనా పరిస్థితులను పరిశీలిస్తున్నామని, పరిస్థితి తీవ్రతను అనుసరించి మంగళవారం నుంచి ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే ప్లాంట్ లో టాటా మోటార్స్ ఇప్పటికే వాహనాల తయారీని తగ్గించింది. ఒకవేళ ప్లాంట్ మూసివేసినా ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెల జీతాలు చెల్లిస్తామని టాటా వర్గాలు ప్రకటించాయి.

అటు టాటా అనుబంధ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ కూడా బ్రిటన్ లో ఏప్రిల్ 20 వరకు కార్యకలాపాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితులు ఒక్క భారత్ లోనే కాదు, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల్లోనూ కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల నడుమ సాగుతూ ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్నాయి.
Tata Motors
Pune
Corona Virus
Jaguar Land Rover

More Telugu News