Corona Virus: దేశంలోని అన్ని ఆసుపత్రులూ బెడ్లు, ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేసుకోవాలి: కేంద్ర ప్రభుత్వం

Govt asks public private hospitals to set aside beds as cases rise
  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు కేంద్రం సూచన
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో  చికిత్స అందించేందుకు రెడీగా ఉండాలన్న కేంద్రం
  • అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచన
కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారి చికిత్సకు సరిపడా పడకలు సిద్ధం చేయాలని అన్ని ఆసుపత్రులు, వైద్య విద్యాసంస్థలను కేంద్రం కోరింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ మేరకు తగిన సూచనలు చేసింది. బెడ్లతో పాటు ఐసోలేషన్‌  సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అదే విధంగా వెంటిలేటర్లను సిద్ధం చేసుకొని, ఆయా వార్డుల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా కరోనా బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు వీలుగా అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాలని తెలిపింది. 
Corona Virus
hospitals
governament
bes

More Telugu News