North Korea: ప్రపంచం 'కరోనా'తో భయపడుతోంటే.. తన పని తాను చేసుకుపోతోన్న ఉ.కొరియా

north korea missiles tests
  • క్షిపణి పరీక్షలు జరిపిన ఉత్తరకొరియా
  • 410 కిలో మీట‌ర్ల దూరం, 50 మీట‌ర్ల ఎత్తులో నుంచి వెళ్లిన క్షిపణులు
  • ప్రకటించిన దక్షిణ కొరియా
ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి ఆందోళన చెందుతుంటే  ఉత్త‌ర‌ కొరియా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఈ రోజు ఆ దేశం రెండు మిస్సైళ్ల‌ను ప‌రీక్షించిందని ద‌క్షిణ కొరియా మిలిట‌రీ ప్రకటించింది.  ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌ ప్రావిన్సు నుంచి తూర్పు దిశ‌గా ఆ క్షిప‌ణులు వెళ్లాయని తెలిపింది.

ఈ క్షిపణులు  410 కిలో మీట‌ర్ల దూరం, 50 మీట‌ర్ల ఎత్తులో నుంచి వెళ్లాయని సమాచారం.  అంతేకాదు, కొన్ని రోజుల క్రితం ఫైరింగ్ డ్రిల్‌లో భాగంగానూ ఉత్తరకొరియా కొన్ని మిస్సైళ్ల‌ను పరీక్షించింది. 'ఓ వైపు ప్ర‌పంచం మొత్తం కరోనా వ్యాప్తితో బాధ‌ప‌డుతోంది.. మరోవైపు ఉత్త‌ర‌ కొరియా మాత్రం ఇటువంటి పరీక్షలు చేయడం శోచ‌నీయ‌ం' అని ద‌క్షిణ కొరియా వ్యాఖ్యానించింది.
North Korea
Corona Virus

More Telugu News