Vijay Sai Reddy: చంద్రబాబు భయపడిందిక్కడే!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు

vijaya sai reddy fires on chandra babu naidu
  • స్థానిక ఎన్నికల్లో టీడీపీ నుంచి డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు
  • డబ్బు, మందు ఇవ్వకపోతే సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళన
  • దీంతో చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టాడు
  • నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'తన మనుగడ కోసం చంద్రబాబు కులం, ప్రాంతం కార్డులను వాడతాడు. ఆయనను నమ్మి చెప్పినట్టు చేసిన వారు తర్వాత సస్పెన్షన్లు, కేసులు ఎదుర్కోవడం చూస్తున్నాం. అయినా సూసైడ్ స్క్వాడ్ సభ్యులు కులదైవం కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. వీళ్ల ఆటలు కొన్ని రోజులు సాగినా చివరకు చట్టాల ముందు తలొంచాల్సిందే' అని ట్వీట్ చేశారు.
 
'స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశ చూపిన డబ్బు తీసుకోవడానికి ఓటర్లు తిరస్కరించారు. చంద్రబాబు భయపడిందిక్కడే. డబ్బు, మందు లేకుండా ఎలక్షన్లు జరిగితే జిల్లాల వారిగా సింగిల్ డిజిట్ కే పరిమితమవుతామన్న ఆందోళనతో డ్రామాలు మొదలు పెట్టాడు. నిమ్మగడ్డతో వాయిదా నాటకం ఆడించాడు' అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Chandrababu
Andhra Pradesh

More Telugu News