Ola: ఓలా, ఊబర్ క్యాబ్ లలో షేరింగ్ ప్రయాణం నిలిపివేత!

  • పూల్ సర్వీస్, పూల్ రైడ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటన 
  • ఇకపై ఒకే కుటుంబం వారికి అనుమతి 
  • కరోనా ప్రభావం నేపథ్యంలో రెండు సంస్థలు నిర్ణయం
ola ubar canceled poolride services

దేశంలోని ప్రముఖ క్యాబ్ సంస్థలు ఓలా, ఊబర్ సంస్థలు పూల్ సర్వీస్, పూల్ రైడర్లను తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి. క్యాబ్ సర్వీస్ ను షేర్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

'కరోనా వైరస్ కారణంగా సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై ఒకే కుటుంబానికి చెందిన వారు మాత్రమే ప్రయణించే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వాస్తవంగా గత కొన్నాళ్లుగా క్యాబ్ బుకింగ్ బాగా తగ్గిపోయింది. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రాకపోవడమే దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో దీనివల్ల నష్టమే అయినా మా వంతుగా కూడా బాధ్యత పాటించాలని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆ సంస్థలు ప్రకటించాయి. అలాగే క్యాబ్ లు పరిశుభ్రంగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి.

More Telugu News