Visakhapatnam: విశాఖలో దారుణం... నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో హత్య

Man murdered in visakhapatnam near 4th town police station
  • వ్యక్తిని బండరాయితో మోది చంపిన దుండగులు
  • వివాహేతర సంబంధం కారణమని అనుమానం
  • పాత కక్షలు కూడా తోడై ఉంటాయన్న భావన
విశాఖ నగరంలో మరో కలకలం. నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు ఓ నలభై ఐదేళ్ల వ్యక్తి మృతదేహం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని బాయ్యశాస్త్రి లే అవుట్‌లో పడివుండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడన్నది తెలియ రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇతని తలపై బండరాళ్లతో మోది చంపేశారు.

అనంతరం మృతదేహాన్ని తెచ్చి స్టేషన్‌కు సమీపంలో పడేశారని అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే నాలుగో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి క్లూస్‌ టీం, డాగ్‌ స్వ్కాడ్‌తో చేరుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు. వివాహేతర సంబంధంగాని, పాత కక్షలుగాని ఈ హత్యకు కారణమై ఉండవచ్చునని పోలీసు అనుమానిస్తున్నారు.
Visakhapatnam
4th town PS
man murdered
unidentified

More Telugu News