Ram Nath Kovind: రాష్ట్రపతిని కలసిన బృందంలో ఎంపీ దుష్యంత్.. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రపతికి ఆరోగ్య పరీక్షలు!

Medical tests to presindent of India Ram nath kovind
  • సింగర్ కనికాకపూర్ ఇచ్చిన విందుకు వెళ్లిన బీజేపీ ఎంపీ దుష్యంత్
  • ‘కరోనా’ సోకిందన్న అనుమానంతో హోం క్వారంటైన్ లో దుష్యంత్
  • అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రాష్ట్రపతి
ఇటీవలే యూకే వెళ్లి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే, ఆమె యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత లక్నోలో ఇచ్చిన విందుకు బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ హాజరయ్యారు. కనికకు ‘కరోనా’ ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్ అయ్యారు.

అయితే, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ఇటీవల కలిసిన బీజేపీ ఎంపీల బృందంలో దుష్యంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.
Ram Nath Kovind
President Of India
Corona Virus
BJP
Dushyanth

More Telugu News