Kanika kapur: సింగర్​ కనికను కలిసిన వారి జాబితా సిద్ధం చేస్తున్న యూపీ అధికారులు?

UP officials compiling a list of people who met Singer Kanika
  • ఇటీవలే యూకే వెళ్లి తిరిగొచ్చిన కనికా కపూర్
  • ఆమె ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆందోళన
  • విదేశీ ప్రయాణ వివరాలను తెలియజేయకపోవడంపై ప్రభుత్వం సీరియస్?
ఇటీవలే యూకే వెళ్లి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ నెల 15న యూకే నుంచి భారత్ కు వచ్చిన కనిక లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు విందు కూడా ఇచ్చింది. అయితే, కనికకు ‘కరోనా’ సోకడంతో ఆమె ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆందోళన మొదలైంది. ఆ విందులో కనికను కలిసిన వారి జాబితాను యూపీ అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె తన విదేశీ ప్రయాణ వివరాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోవడంపై కనికపై యూపీ సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

Kanika kapur
Bollywood
singer
Uttar Pradesh
Government

More Telugu News