Sajjanar: విదేశీ ప్రయాణాలు చేసిన వారు స్వచ్ఛందంగా సహకరించాలి: సీపీ సజ్జనార్

Hyderabad police commissioner Sajjanar urges people who traveled abroad
  • తెలంగాణలో 8 కరోనా పాజిటివ్ కేసులు
  • జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసిన సర్కారు
  • ప్రజలు సదస్సులు, సమావేశాలకు దూరంగా ఉండాలన్న సీపీ
  • నగరంలో విదేశీయుల సమాచారం సేకరిస్తున్నామని వెల్లడి
తెలంగాణలో 8 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రభుత్వం చర్యల ఉద్ధృతిని పెంచింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసిన వారిపై దృష్టి సారించింది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, విదేశీ ప్రయాణాలు చేసిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

విదేశీ ప్రయాణలు చేసిన వారు స్వయంగా బయటికి వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు సదస్సులు, సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో ప్రధాన పండుగలు వస్తున్నందున మతపెద్దలు సహకరించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా మరింత పెంచామని, సైబరాబాద్ లో నివసిస్తున్న విదేశీయుల సమాచారం సేకరిస్తున్నామని అన్నారు.
Sajjanar
Telangana
Corona Virus
Hyderabad
Cyberabad

More Telugu News