Pawan Kalyan: ‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి: పవన్​ కల్యాణ్​

Pawan Kalyan press note abotu Janata curfew
  • మోదీ సూచనలు తెలుగు వారందరూ పాటించాలి
  • ఈ నెల 22న ఆదివారం రోజు ‘జనతా కర్ఫ్యూ’ పాటిద్దాం
  • 24 క్రాఫ్ట్లకు సంబంధించిన ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భారంగా  ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘కరోనా’పై పోరాటంలో భాగంగా ఈ నెల 22న ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలని కోరుతూ ఓ వీడియోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

 తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి

‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలని, ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, నటీనటులు, 24 క్రాఫ్టులకు సంబంధించిన ప్రతీ ఒక్కరూ దీనిలో పాల్గొనాల్సిందిగా ప్రార్థిస్తున్నానంటూ పవన్ ఓ పోస్ట్ చేశారు.
Pawan Kalyan
janasena
Janata Curfew

More Telugu News