బేర్ గ్రిల్స్ తో కలిసి రజనీకాంత్ రోమాంఛక విన్యాసాలు... వీడియో ఇదిగో!
- రజనీకాంత్ తో బేర్ గ్రిల్స్ 'ఇంటూ ద వైల్డ్' ఎపిసోడ్ చిత్రీకరణ
- డిస్కవరీ చానల్లో ఈ నెల 23న ప్రసారం
- స్నీక్ పీక్ మూమెంట్స్ వీడియో విడుదల చేసిన చానల్
- బస్ కండక్టర్ నని చెప్పి గ్రిల్స్ ను ఆశ్చర్యానికి గురిచేసిన రజనీ
ఈ వీడియోలో రజనీకాంత్ విన్యాసాలను చూడొచ్చు. ఓ వంతెన ఇనుప రెయిలింగ్ పై రజనీ, బేర్ గ్రిల్స్ నడవడం సినిమా స్టంట్ కు తీసిపోని విధంగా ఉంది. కాగా, సినిమాల్లోకి రాకముందు మీరేం చేసేవారు? అని బేర్ గ్రిల్స్ ప్రశ్నించగా, 'బస్ కండక్టర్' అని రజనీకాంత్ జవాబు చెప్పారు. దాంతో బేర్ గ్రిల్స్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.
మరో సంభాషణలో తాను సినిమాల వరకే రజనీకాంత్ నని, ఇంటికి వెళితే శివాజీరావ్ గైక్వాడ్ నని తెలిపారు. ఎవరన్నా గుర్తు చేస్తే తప్ప రజనీకాంత్ నన్న విషయం జ్ఞప్తికి రాదని, షూటింగ్ తర్వాత రజనీ అనే పేరును మర్చిపోతానని వివరించారు. అంతేకాదు, ఇలాంటి సాహసాలను తన జీవితంలో ఎన్నడూ చేయలేదని రజనీకాంత్ విస్మయం వ్యక్తం చేశారు.