Jagan: ‘కరోనా’ ఎఫెక్ట్​.. ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఏప్రిల్​ 14కు వాయిదా

  • 25న ఉగాది పండగ రోజు పంపిణీ చేయాల్సి ఉన్న ఇళ్ల పట్టాలు
  • ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలు చేపడుతున్నందున వాయిదా
  • ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు పంపిణీ చేస్తామన్న సీఎం జగన్
 Distribution of title deeds to poor in AP postponed to April 14

ఏపీలో ఈ నెల 25న ఉగాది పండగ రోజున నిర్వహించాల్సి ఉన్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపైనా ‘కరోనా’ ఎఫెక్ట్ పడింది. ఆ రోజుకు బదులుగా ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇళ్ల పట్టాలు, ప్లాట్ల అభివృద్ధిపై సమీక్షించారు. రాష్ట్రంలో ‘కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యలు చేపడుతున్నందున ఉగాది పండగ రోజు నిర్వహించాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు వివరించారు. ‘కరోనా’ నేపథ్యంలో లబ్ధిదారులందరికీ ఒకేసారి కాకుండా సోషల్ డిస్టెన్స్ వంటి జాగ్రత్తలు పాటిస్తూ వారికి స్థలాలను చూపించాలని అధికారులకు జగన్ సూచించారు.

More Telugu News