తండ్రి కోసం సింహాసనాన్ని తయారు చేయించిన మంచు లక్ష్మి
- నిన్న మోహన్ బాబు పుట్టినరోజు
- మూడు సింహాల బొమ్మలతో సింహాసనం
- ఫోటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి
"మా నాన్నకు కొత్త సింహాసనం. ఈ సింహాసనంలోని మూడు సింహాలు, మా ముగ్గురికీ నిదర్శనం. దీన్ని నేనే చేయించాను" అని కామెంట్ పెట్టారు. కాగా, ప్రస్తుతం మోహన్ బాబు సూర్య హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'సూరరైపోట్రు' (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న 'ఆచార్య'లోనూ మోహన్ బాబు నటిస్తారని టాలీవుడ్ వర్గాలు అంటున్నా, దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.