Nirbhaya: ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది: నిర్భయ దోషులను ఉరితీసిన తలారి పవన్ జల్లాడ్

I am happy when my duty fulfilled says talari pawan jallad
  • ఈరోజు కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నాను 
  • నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను 
  • మనసు ప్రశాంతంగా ఉంది

నిర్భయ హత్యకేసు దోషులు ముఖేష్ సింగ్, అక్షయ్, వినయ్, పవన్ గుప్తాలను ఉరితీయడంతో ఇప్పుడు తన మనసు ప్రశాంతంగా ఉందని ఉత్తరప్రదేశ్ కు చెందిన తలారి పవన్ జల్లాడ్ తెలిపారు.

'చాలాకాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఉదయం నా కర్తవ్యాన్ని పూర్తి చేయడంతో మనసు సంతోషంగా ఉంది' అని వ్యాఖ్యానించారు. కోర్టు దోషులుగా నిర్ధారించిన తర్వాత ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు ఎన్నో ఎత్తుగడలను అనుసరించిన విషయం తెలిసిందే. పలు రూపాల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష తప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు.

ఇక వీరి ప్రయత్నాల కారణంగా రెండు సార్లు జారీ అయిన డెత్ వారెంట్ వాయిదా పడింది. మూడోసారి డెత్ వారెంట్ కూడా అమలవుతుందా? అన్న సందేహాలు వక్తమయ్యాయి. అయితే కోర్టు అన్ని పిటిషన్లను తిరస్కరించడంతో నిర్భయ దోషుల కథ నేటితో ముగిసింది.

Nirbhaya
death warant
pawan jallad

More Telugu News