Chittoor District: తిరుపతి ఎయిర్‌పోర్టులో కరోనా ముందస్తు తనిఖీల్లేవు

  • రోజుకి మూడు వేల మంది ప్రయాణికుల రాకపోకలు
  • స్వచ్ఛందంగా తనిఖీ చేసుకోవడమే తప్ప కట్టడి లేదు
  • డొమెస్టిక్‌ సర్వీసువల్లే అని చెబుతున్న అధికారులు
No sreaning tests in tirupathi airport

కరోనా ఎఫెక్ట్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు జరుగుతున్నా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. నిత్యం ఈ విమానాశ్రయానికి విశాఖ, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి విమానాల రాకపోకలు ఉంటాయి. కనీసం 2,700 నుంచి 3 వేల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతారు.

అయితే వచ్చి వెళ్లిన వారిలో ఎవరైనా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడం తప్ప అధికారులు మాత్రం ఎటువంటి కట్టడి చేయడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే ఈ విమానాశ్రయానికి వచ్చే సర్వీసులన్నీ దేశీయ (డొమెస్టిక్‌)మైనవని, అందువల్లే చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది మాత్రం మాస్క్‌లు, గ్లౌజులు వినియోగిస్తున్నా ప్రయాణికుల పట్ల మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News