Namrata: ఇలా కరోనా వ్యాప్తిని అరికడదాం: మహేశ్ బాబు భార్య నమ్రత వీడియో

Washing hands the right way can prove most effective in keeping COVID far namrata
  • 'సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌'లో పాల్గొన్న నమ్రత
  • చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచన
  • 20-40 క్షణాల పాటు చేతులు కడుక్కోవాలని పిలుపు
కరోనా వైరస్‌ బారిన పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందులో భాగంగా 'సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌' పేరిట చేతులను శుభ్రం చేసుకునే విధానంపై విస్తృత ప్రచారం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఇందులో పాల్గొని అవగాహన కల్పించాలని కోరింది. ఇందులో ఇప్పటికే చాలా మంది సినీ తారలు పాల్గొన్నారు. తాజాగా, మహేశ్ బాబు భార్య నమ్రత కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి చేతులు కడుక్కుని వీడియో పోస్ట్ చేసింది.  

'కొవిడ్‌-19 బారిన పడకుండా ఉండేందుకు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చాలా చక్కటి మార్గం. 20 నుంచి 40 క్షణాల పాటు చేతులు కడుక్కోవడానికి సమయాన్ని వినియోగించి సూక్ష్మజీవులను నాశనం చేయొచ్చు. అందరం కలిసి కరోనాను తరిమికొడదాం' అని ఆమె సందేశం ఇచ్చారు.
Namrata
Mahesh Babu
Tollywood

More Telugu News