Nirbhaya: ఆసుపత్రికి నిర్భయ దోషుల మృతదేహాలు

Bodies of all four Nirbhaya convicts taken to hospital for post mortem Hanging of convicts
  • దోషుల మృతదేహాలకు శవ పరీక్షలు
  • మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్న తీహార్‌ జైలు డైరెక్టర్‌
  • మృతదేహాలకు అంతిమ యాత్ర వంటివి నిర్వహించకూడదన్న అధికారులు
నిర్భయ దోషుల మృతదేహాలను దీన్‌దయాళ్‌ ఆసుపత్రికి తరలించారు. వారి మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం జైలు అధికారులు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని తీహార్‌ జైలు డైరెక్టర్‌ జనరల్ సందీప్ గోయల్ మీడియాకు తెలిపారు. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయగా 8.20 గంటలకు అక్కడి నుంచి జైలు అధికారులు దోషుల మృతదేహాలను డీడీయే ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలకు అంతిమ యాత్ర వంటివి నిర్వహించకూడదని కుటుంబ సభ్యులకు అధికారులు సూచించారు. అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు.
Nirbhaya
New Delhi

More Telugu News