70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'నారప్ప'

20-03-2020 Fri 09:22
  • 56 రోజుల పాటు జరిగిన చిత్రీకరణ 
  •  పీటర్ హెయిన్స్ ఫైట్స్ హైలైట్ 
  • నాయికలుగా ప్రియమణి - రెబ్బా మోనికా జాన్
Narappa Movie

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' చిత్రం రూపొందుతోంది. వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్' కి రీమేక్. విభిన్నమైన గెటప్ తో .. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో వెంకటేశ్ కనిపించనున్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇంతవరకూ జరిపిన 56 రోజుల షూటింగుతో 70 శాతం చిత్రీకరణ పూర్తయినట్టుగా చెబుతున్నారు.

కేరళలో షూటింగు జరుగుతుండగా కరోనా గురించిన వార్తలు తీవ్రతరం కావడంతో, నాలుగు రోజుల పాటు షూటింగు మిగిలి ఉండగానే ఈ సినిమా టీమ్ వెనుదిరిగింది. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. వెంకటేశ్ సరసన ఒక కథానాయికగా ప్రియమణి నటిస్తుండగా, మరో కథానాయికగా రెబ్బా మోనికా జాన్ కనిపించనుంది.