Nimmagadda Prasad: సెర్బియా నిర్బంధం నుంచి విడుదలైన నిమ్మగడ్డ ప్రసాద్... హైదరాబాద్ రాగానే క్వారంటైన్ కు తరలింపు!

Nimmagadda Prasad arrives Hyderabad as Serbia released
  • రస్ అల్ ఖైమా ఫిర్యాదుతో నిమ్మగడ్డను అరెస్ట్ చేసిన సెర్బియా 
  • నెలలతరబడి జైల్లో గడిపిన ప్రసాద్
  • అరెస్ట్ చెల్లదని తీర్పు ఇచ్చిన సెర్బియా సుప్రీంకోర్టు
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రస్ అల్ ఖైమా సంస్థ ఫిర్యాదుతో తెలుగు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను యూరప్ దేశం సెర్బియా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు చెల్లదంటూ సెర్బియా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు సెర్బియా పోలీసులు ఆయనను విడుదల చేశారు.

నెలల తరబడి నిర్బంధంలో మగ్గిన నిమ్మగడ్డ ప్రసాద్ ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయనను అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి క్వారంటైన్ శిబిరానికి తరలించారు. కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో నిమ్మగడ్డ ప్రసాద్ 14 రోజుల పాటు వైద్య పరిశీలనలో ఉండకతప్పదు.
Nimmagadda Prasad
Serbia
Rus Al Khaima
Police
Hyderabad
Corona Virus

More Telugu News