KCR: కిరాణాషాపులు తెరిచే ఉంటాయి.. కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే ఉపేక్షించం: సీఎం కేసీఆర్​ హెచ్చరిక

  • నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించొద్దు
  • ‘బ్లాక్ మార్కెట్ గాళ్లను’ ఉపేక్షించం
  • ఉగాది, నవమి ఉత్సవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించం
CM Kcr warns who to create artificial scarcity

కిరాణాషాపులు, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.‘ కరోనా’పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించాలని చూసే ‘బ్లాక్ మార్కెట్ గాళ్లను’ ఉపేక్షించమని హెచ్చరించారు.

ఇంతకుముందు థియేటర్లు, మాల్స్ మూసివేతను వారం రోజులుగా నిర్ణయించామని, అయితే, ఆ గడువును ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లో భక్తులను అనుమతించవద్దని ఇప్పటికే ఆదేశాలిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కరోనా‘ వ్యాప్తి చెందకుండా చేపట్టిన నివారణా చర్యల్లో భాగంగా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను కూడా రద్దు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించమని స్పష్టం చేశారు. ఉగాది పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు తమ ఇళ్లల్లో నుంచే ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని అన్నారు.

More Telugu News