Prabhas: ప్రభాస్ సినిమా విఎఫ్ఎక్స్ కోసం 50 కోట్లు?

Nag Ashwin Movie
  • ప్రభాస్ నుంచి రానున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 
  • సైన్స్ ఫిక్షన్ జోనర్లో తదుపరి సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
ప్రభాస్ నుంచి త్వరలో రానున్న రొమాంటిక్ లవ్ స్టోరీ కోసమే కాదు, ఆ తరువాత ఆయన చేయనున్న నాగ్ అశ్విన్ సినిమా విశేషాల కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

సైన్స్ ఫిక్షన్ జోనర్లో ఈ కథ నడవనుంది. అందువలన విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పిన దానిని బట్టి, గ్రాఫిక్స్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో తెలుసుకోవచ్చు. కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 50 కోట్లను కేటాయించారనేది తాజా సమాచారం. దీనిని బట్టి చూస్తే, ఇది కూడా భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే సినిమానే అనే విషయం అర్థమవుతోంది.
Prabhas
Radhakrishna Kumar
Nag Ashwin Movie

More Telugu News