Andhra Pradesh: ఏపీ ఎస్ఈసీ నివాసం, కార్యాలయానికి కేంద్ర బలగాలతో అదనపు భద్రత

  • విజయవాడలోని ఎస్ఈసీ కేంద్ర బలగాలతో అదనపు భద్రత
  • గన్నవరం నుంచి వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలు
  • పది మంది సీఆర్పీఎఫ్ పోలీసులతో భద్రత
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నివాసం, కార్యాలయం పరిసరాల్లో కేంద్ర బలగాలతో అదనపు భద్రత కల్పించనున్నారు. విజయవాడలోని స్థానిక బందర్ రోడ్డులో ఎస్ఈసీ కార్యాలయం ఉంది. పది మంది సీఆర్పీఎఫ్ పోలీసులతో భద్రత కల్పించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని 39వ బెటాలియన్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దింపారు.  
Andhra Pradesh
State Election Commission
Additional protection
CRPF

More Telugu News