Bhumika Chawla: లేడీ విలన్ గా కనిపించనున్న భూమిక

Actress Bhumika Chawla
  • కేరక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు 
  • నెగెటివ్ పాత్రల పట్ల ఆసక్తి
  • స్టార్ హీరో సినిమాలో లేడీ విలన్ గా అవకాశం
 కథానాయికగా కేవలం ఆడిపాడే పాత్రలను కాకుండా, ప్రాధాన్యత కలిగిన వైవిధ్యభరితమైన పాత్రల ద్వారా భూమిక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. రీ ఎంట్రీ తరువాత కూడా ఆమె విలక్షణమైన పాత్రలని మాత్రమే అంగీకరిస్తూ వెళుతోంది. అలా ఆమె చేసిన 'సవ్యసాచి' .. 'ఎంసీఏ' .. 'రూలర్' సినిమాల్లోని పాత్రలు మరింత పేరును తెచ్చిపెట్టాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తెలుగులో తను ఒక స్టార్ హీరో సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా చెప్పింది. నెగెటివ్ షేడ్స్ తో కూడిన లేడీ విలన్ గా తను కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయాలనే తను చాలాకాలం నుంచి అనుకుంటున్నాననీ, అలాంటి పాత్ర పడటం తన అదృష్టమని చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏమిటి? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Bhumika Chawla
Actress
Tollywood

More Telugu News