Veena-Vani: పబ్లిక్ పరీక్షలకు హాజరైన వీణావాణీ... అరగంట అదనపు సమయం కేటాయింపు

Conjunction twins Veena and Vaani appeared at Tenth class public exams
  • టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్న అవిభక్త కవలలు
  • మధురానగర్ ప్రతిభా హైస్కూల్ లో పరీక్షలు రాసేందుకు వచ్చిన వీణావాణీ
  • ఇద్దరికీ వేర్వేరుగా హాల్ టికెట్లు
అవిభక్త కవలలు వీణావాణీ ఇవాళ తెలంగాణ టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యారు. వీరికి హైదరాబాదులోని మధురానగర్ ప్రతిభా హైస్కూల్ లో సెంటర్ కేటాయించారు. వీణావాణీలను యూసుఫ్ గూడ స్టేట్ హోం నుంచి ప్రత్యేక వాహనంలో పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. అరగంట ముందే ప్రతిభ హైస్కూల్ కు వచ్చిన ఈ అవిభక్త కవలలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాస్తున్న వీణావాణీలకు వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చారు. అంతేకాదు, వీరిద్దరి సౌలభ్యం కోసం అదనంగా అరగంట సమయం కేటాయించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇద్దరూ మాస్కులతో వచ్చారు.
Veena-Vani
Conjuncted Twins
Hyderabad
Tenth Exams

More Telugu News