Sensex: కొనసాగుతున్న భయాలు.. వరుసగా నాలుగో రోజూ నష్టపోయిన మార్కెట్లు

  • మార్కెట్లపై కరోనా పంజా
  • 2,155 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 205 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex extends losses to fourth day

దేశీయ స్టాక్ మార్కెట్లలో కరోనా భయాల కారణంగా నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 2,155 పాయింట్లు నష్టపోయింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 28,288కి పడిపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయి 8,263కు దిగజారింది. ఈ రోజు టెలికాం మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (7.50%), భారతి ఎయిర్ టెల్ (4.39%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.96%), హీరో మోటోకార్ప్ (2.39%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.26%)

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-10.24%), మారుతి సుజుకి (-9.85%), యాక్సిస్ బ్యాంక్ (-9.50%), మహీంద్రా అండ్ మహీంద్రా (-9.28%), టెక్ మహీంద్రా (-8.43%).

More Telugu News