Annavaram: ‘కరోనా’ ప్రభావం.. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు నిలిపివేత

Due to corona Annavaram Devastanam takes important decision
  • మూడు వారాల పాటు వ్రతాలు నిలిపివేత
  • భక్తులకు వైద్య పరీక్షల తర్వాతే కొండ పైకి అనుమతిస్తాం
  • నిత్యాన్నదానం కింద ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తాం
‘కరోనా’ ప్రభావం ప్రముఖ దేవాలయాలపైనా పడింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలోని ప్రసిద్ధ శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయంలో మూడు వారాల పాటు వ్రతాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో ఆలయ ఈవో త్రినాథ్ రావు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టే నివారణ చర్యల్లో భాగంగా భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొండ పైకి అనుమతి ఇస్తామని అన్నారు. అన్నవరం ఆలయంలో నిత్యాన్నదానం కింద ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందిస్తామని వివరించారు.
Annavaram
satya narayana swamy temple
Corona Virus

More Telugu News