Ravivarma: రవివర్మ 'విశ్వామిత్రుడు' ఆరున్నర కోట్లు!

Ravi Varma painitng Viswamitra garners crores in auction
  • రవివర్మ పెయింటింగ్ ను వేలం వేసిన సోత్ బీస్ సంస్థ
  • రూ.6.45 కోట్లకు దక్కించుకున్న అజ్ఞాతవ్యక్తి
  • గతంలోనూ రవివర్మ పెయింటింగ్ కు అదిరిపోయే ధర
భారతదేశం గర్వించదగ్గ చిత్రకారుడిగా రాజా రవివర్మ చరిత్రలో నిలిచిపోతారు. ఆయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి. రవివర్మ సృష్టించిన విశ్వామిత్రుడి పెయింటింగ్ తాజాగా ఓ అంతర్జాతీయ వేలంలో కోట్ల ధర పలికింది. ప్రముఖ వేలం సంస్థ సోత్ బీస్ నిర్వహించిన ఆన్ లైన్ వేలం ప్రక్రియలో రవివర్మ 'విశ్వామిత్రుడు' పెయింటింగ్ ను ఓ అజ్ఞాత వ్యక్తి రూ.6.45 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. కాగా, రెండేళ్ల కిందట రవివర్మ 'దమయంతి' పెయింటింగ్ ఇంతకు రెట్టింపు ధర పలికింది. తాజాగా, 'విశ్వామిత్రుడు' పెయింటింగ్ కోసం గతనెలలో ఆన్ లైన్ బిడ్డింగ్ కు తెరలేపగా, రెండ్రోజుల కిందటే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది.
Ravivarma
Viswamitra
Painting
Auction
Sotheby

More Telugu News