Vishwak Sen: రానా క్లాప్ తో విష్వక్సేన్ కొత్త చిత్రం ప్రారంభం

Paagal Movie
  • దర్శకుడిగా నరేశ్ పరిచయం 
  • టైటిల్ గా 'పాగల్' ఖరారు 
  • సంగీత దర్శకుడిగా రాధన్
'ఫలక్ నుమా దాస్' సినిమాతో మాస్ ఆడియన్స్ ఆదరణ పొందిన విష్వక్సేన్, ఇటీవల వచ్చిన 'హిట్' సినిమాతో నటన పరంగా మరిన్ని మార్కులు సంపాదించుకున్నాడు. ఆయన 5వ సినిమా షూటింగ్ కొంతసేపటి క్రితం లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాకి 'పాగల్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

'దిల్' రాజు చేతుల మీదుగా నూతన దర్శకుడు నరేశ్ స్క్రిప్ట్ అందుకున్నాడు. విష్వక్సేన్ పై రానా క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగ్ మొదలైంది. 'జెమిని' కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా .. తొలి షాట్ కి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాధన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో నాయికలు .. ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలతో పాటు, ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Vishwak Sen
Naresh Kuppili
Paagal Movie

More Telugu News