Indian Railways: కరోనా ఎఫెక్ట్... భారీ సంఖ్యలో రైళ్ల రద్దు: ప్రయాణికులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం

  • రద్దీ లేకపోవడంతో ఇండియన్ రైల్వే నిర్ణయం 
  • ఈనెల 20 నుంచి 31 వరకు మొత్తం 168 రైళ్ల రద్దు 
  • ఇప్పటికే 98 రైళ్లు రద్దు
Indian railway canceled number of trains

కరోనా ప్రభావం నేపథ్యంలో పలువురు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఇండియన్ రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. ప్రధాన రైళ్లకు జనం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 168 రైళ్లను రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు.

ఈనెల 31వ తేదీ వరకు రద్దు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే 98 రైళ్లను రద్దు చేశారు. ఇందులో  వెస్ట్, నార్తర్న్ సెంట్రల్ రైల్వేలో 11 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వేలో 20, సదరన్ రైల్వేలో 32, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 5 రైళ్లు ఉన్నాయి. 

రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు ఉన్న వారి చేత రైల్వే కేటరింగ్ పనులు చేయకుండా చూడాలని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News