Corona Virus: అసలు కరోనా ఎక్కడి నుంచి వచ్చిందంటే... 'నేచర్ మెడిసిన్' జర్నల్ కథనం!

  • గబ్బిలాల్లో అభివృద్ధి చెందింది
  • జన్యు క్రమంలో కృత్రిమ చేరికలు లేవు
  • స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల అంచనా
Corona Virus Comes from Nature

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను ఎవరూ సృష్టించలేదని, ఈ వైరస్ రీసెర్చ్ సెంటర్లలో తయారు కాలేదని స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు అంటున్నారు. వీరు సమర్పించిన తాజా పరిశోధనా వ్యాసం 'నేచర్ మెడిసిన్' జర్నల్ లో ప్రచురితమైంది. కరోనా వైరస్ ప్రకృతి పరిణామ క్రమంలో భాగంగా, సహజసిద్ధంగా ఉద్భవించిన సూక్ష్మజీవని వారు వెల్లడించారు.

ఇది గబ్బిలాల్లో వృద్ధి చెందుతూ ఉండిపోయిందని, ఇప్పుడు మనుషులకు వ్యాపించిందని, దీని ప్రభావం లక్షల మందిపై ఉంటుందని వారు అంచనా వేశారు. సార్స్ తదితర వైరస్ ల జన్యుక్రమాలను, కరోనా జన్యుక్రమాన్ని విశ్లేషించి, తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనా వ్యాసంలో వెల్లడించారు. ఈ వైరస్ జన్యుక్రమంలో కృత్రిమంగా ఏమీ చేర్చలేదని సైంటిస్ట్ క్రిస్టియాన్ ఆండర్సన్ వెల్లడించారు. ఇది ఇతర వైరస్ లతో పోలిస్తే భిన్నమైన మూలభాగాన్ని కలిగుందని, ఇది సహజసిద్ధంగా అభివృద్ధి చెందిన సూక్ష్మజీవి అనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.

More Telugu News