Brain Glad: జార్జియాలో స్పృహ కోల్పోయిన భువనగిరి అమ్మాయి... ఇండియాకు పంపేందుకు ససేమిరా!

Bhuvanagiri Girl Sivani Stopped at Georgia Airport
  • వైద్య విద్య కోసం వెళ్లిన శివాని 
  • మెదడులో రక్తం గడ్డకట్టడంతో అపస్మారక స్థితికి
  • ఇండియాకు రప్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు
వైద్య విద్య నిమిత్తం జార్జియాకు వెళ్లిన భువనగిరి యువతి శివాని, అక్కడ ఉన్నట్టుండి వాంతులు చేసుకుని కళ్లు తిరిగి పడిపోగా, ఆమెను ఇండియాకు పంపేది లేదని అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే, వెంకటేశ్, సరిత దంపతుల కుమార్తె శివాని, జార్జియాలోని అకాకి త్సెరెటెలీ యూనివర్శిటీలో మెడిసిన్ చదువుతోంది. ఒక రోజు కాలేజీకి బస్సులో వెళుతుండగా, వాంతి చేసుకుని స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తేల్చారు.

ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు, హైదరాబాద్ లోనే మెరుగైన చికిత్స జరుగుతుందన్న ఉద్దేశంతో, కిమ్స్ డాక్టర్లను సంప్రదించి, శివానిని తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తీరా బయలుదేరిన తరువాత, విమానాశ్రయం సిబ్బంది ఆమెను ఇండియాకు పంపేందుకు అంగీకరించలేదు. దీంతో తమ కుమార్తెను ఇండియాకు రప్పించేందుకు విదేశాంగ శాఖ కల్పించుకోవాలని వెంకటేశ్ కోరారు.
Brain Glad
Airport
Georgia
Sivani

More Telugu News